షార్జా టవర్ అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి, 44 మందికి గాయాలు
- April 06, 2024
యూఏఈ: షార్జా అధికారులు శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో అల్ నహ్దాలోని ఎత్తైన నివాస భవనంలో మంటలు చెలరేగడంతో పొగతో ఊపిరాడక 5 మంది మరణించారని, 17 మంది మోస్తరు గాయాలతో మరియు 27 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు. 17 మందికి అత్యవసర వైద్యసేవలు అందించామని పోలీసులు తెలిపారు. 156 మంది నివాసితులకు ఆశ్రయం ఇవ్వబడింది, ఇందులో 18 మంది పిల్లలు ఉన్నారు. శుక్రవారం రాత్రి 10.50 గంటలకు అధికార యంత్రాంగానికి కాల్ వచ్చిందని, అత్యవసర ప్రతిస్పందన బృందాలు వెంటనే పొరుగు ప్రాంతాలకు తరలించామని, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో నివాసితులను సురక్షితంగా తీసుకువెళ్లారు. టవర్లో 750 అపార్ట్మెంట్లతో సహా 39 అంతస్తులు ఉన్నాయి. మృతుల కుటుంబాలకు అధికార యంత్రాంగం ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







