స్కిల్ ట్రైనింగ్ ద్వారా నిరుపేద యువతకు జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సాధికారత

- April 06, 2024 , by Maagulf
స్కిల్ ట్రైనింగ్ ద్వారా నిరుపేద యువతకు జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సాధికారత

హైదరాబాద్: జీఎంఆర్ గ్రూప్ యొక్క సిఎస్ఆర్ విభాగమైన జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ ( GMRVF) ఇండస్ట్రీ లీడర్లుగా ఉన్న కంపెనీలు సహకారంతో, నైపుణ్య శిక్షణ కార్యక్రమాల ద్వారా యువతకు సాధికారత కల్పించడంలో, ఉత్తమ శిక్షణను అందిస్తూ కోర్సు పూర్తయిన తర్వాత ప్లేస్మెంట్ మద్దతును అందించడంలో ముందంజలో ఉంది. వోల్వో, టివిఎస్, సెయింట్ గోబెన్ - జిప్రోక్, హెచ్ఎంఎస్ హోస్ట్, ఫెబర్ సింధూరీ , తాజ్ వివాంన్తా, హయాత్ హోటేల్స్ , మెక్  డోనాల్డ్స్ , సొడెక్సొ, వీ ఏం ప్రెసిషన్  పంచ్, సింగర్ మరియు రైటర్స్ వంటి పరిశ్రమ భాగస్వాములు విద్యార్థుల నైపుణ్యాలను రూపొందించడంలో సహకారాన్ని అందిస్తారు.

 

శంషాబాద్ లోని ఎయిర్పోర్ట్ క్యాంపస్ లో ఉన్న స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ప్రస్తుతం పాఠశాల, కళాశాల డ్రాపవుట్లకు ఏడు విభిన్న కోర్సులను అందిస్తోంది, ఇవన్నీ నిరుద్యోగ యువతకు ఉచితం. పురుషులకు&మహిళలకు, ఆహారం మరియు వసతితో సహా శిక్షణ అందించబడుతుంది, డాటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులో మహిళలకు రవాణా మరియు భోజన సౌకర్యాలతో డే కోర్సులను అందిస్తుంది. గెస్ట్ సర్వీస్ అసోసియేట్, ఆటోమొబైల్ రిపేర్, ఎక్స్కవేటర్ ఆపరేటర్, డ్రై వాల్స్ అండ్ ఫాల్స్ సీలింగ్ టెక్నీషియన్,వెల్డింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్,  మరియు  రిటైల్ సేల్స్ అసోసియేట్ కోర్సులను 3 నెలల కోర్సుగా  అందిస్తున్నారు.

ప్రవేశ ప్రమాణాలలో 18 నుంచి 28 సంవత్సరాలు వయస్సు ఉంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (BPL) కుటుంబానికి చెందినవారు మరియు ఎస్ఎస్సి ఫెయిల్ లేదా ఉత్తీర్ణత యొక్క కనీస అర్హత కలిగి ఉండాలి. డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుకు తప్పనిసరిగా ఎస్ఎస్సీ ఉత్తీర్ణత అవసరం.

ఇప్పటి వరకు, జీఎంఆర్ వీ ఎఫ్ 18,000 మందికి పైగా అభ్యర్థులకు విజయవంతంగా శిక్షణ ఇచ్చింది, 90% ప్లేస్మెంట్ సపోర్ట్ను కలిగి ఉంది. టెక్నికల్ ట్రైనింగ్ తో పాటు, పాల్గొనే వారందరికీ స్పోకెన్ ఇంగ్లిష్ మరియు సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ కు జీఎంఆర్ వీ ఎఫ్ ప్రాధాన్యత ఇస్తుంది.

వివిధ కోర్సుల్లో పరిమిత సీట్లు అందుబాటులో ఉండటంతో కొత్త బ్యాచ్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మరిన్ని వివరాలకు ఆసక్తిగల అభ్యర్థులు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు 8985800102 నంబర్ పై సంప్రదించాలని సూచించారు. ఒకేషనల్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ 10 ఏప్రిల్ 2024.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com