టిల్లుగాడు దూసుకెళ్తున్నాడు.!
- April 06, 2024
‘డీజె టిల్లు’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో, ఎక్కువ వెయిట్ చేయించకుండా రెండో పార్ట్‌కి వెళ్లిపోయాడు సిద్దు జొన్నలగడ్డ. కథ, కాకరకాయ్ ఏమీ లేదు మా సినిమాకి.. అని చెబుతూనే ‘టిల్లు స్క్వేర్’తోనూ మరో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు.
ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ అస్సలు వెళ్లరనుకున్నారు మొదట్లో. కానీ, బాగానే ఎట్రాక్ట్ అయ్యారు. ఇక యూత్‌లో అయితే, విపరీతమైన క్రేజ్. హాలీడేస్‌ని ఈ సినిమా బాగా క్యాష్ చేసుకుంటోంది.
రెండో వారంలోనూ అదే హుషారు నడుస్తోంది. ఈ వారం ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజైనప్పటికీ ‘టిల్లు స్క్వేర్’ చూసే ఆడియన్స్ కూడా బాగానే కనిపిస్తున్నారు ధియేటర్స్ వద్ద. వసూళ్లు బాగా వస్తున్నాయ్. మొదటి వారమే బ్రేక్ ఈవెన్ అయిపోయాడు టిల్లుగాడు.
ఇక, రెండో వారం కూడా పూర్తయిపోతోంది. ఈ వీకెండ్ కలెక్షన్లు కూడా బాగానే రాబట్టొచ్చని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. ఇప్పటికైతే 96 కోట్ల గ్రాస్ సాధించి త్వరలోనే వంద కోట్ల క్లబ్బులోకి దూకేసేలా వుంది ‘టిల్లు స్క్వేర్’. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ఓ సక్సెస్ మీట్ నిర్వహిస్తోంది.
గ్లోబల్ స్టార్ ఎన్టీయార్ ఈ సక్సెస్ మీట్‌కి ముఖ్య అతిధిగా వస్తుండడంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
తాజా వార్తలు
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!