ప్రయాణికులకు గుడ్ న్యూస్..లుసైల్ ట్రామ్ సేవల విస్తరణ
- April 07, 2024
దోహా: రవాణా మంత్రిత్వ శాఖ (MOT) ఏప్రిల్ 8 నుండి లుసైల్ ట్రామ్ సేవలను విస్తరిస్తోంది. ఇది పింక్ లైన్ సేవతోపాటు అన్ని ఆరెంజ్ లైన్ స్టేషన్లలో నిర్వహిస్తుంది. నైఫా, ఫాక్స్ హిల్స్ సౌత్, డౌన్‌టౌన్ లుసైల్, అల్ ఖైల్ స్ట్రీట్, ఫాక్స్ హిల్స్ - నార్త్, క్రెసెంట్ పార్క్ - నార్త్, రౌదత్ లుసైల్, ఎర్కియా, లుసైల్ స్టేడియం మరియు అల్ యాస్మీన్ అనే పది కొత్త ఆరెంజ్ లైన్ స్టేషన్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. అన్ని పింక్ లైన్ స్టేషన్లు లెగ్టైఫియా నుండి సీఫ్ లుసైల్ - నార్త్ వరకు, అల్ సాద్ ప్లాజా మినహా 10 స్టేషన్లు సేవలు అందుబాులోకి వస్తాయి. దీంతో కొత్త స్టేషన్ల సంఖ్య 14కి పెరిగింది. లుసైల్ ట్రామ్లోని మొత్తం కార్యాచరణ స్టేషన్ల సంఖ్య 21కి చేరుకుంది. లుసైల్ ట్రామ్ సర్వీస్ వారానికి ఏడు రోజులు దోహా మెట్రోలో అదే సర్వీస్ గంటలతో నడుస్తుంది. శనివారం నుండి బుధవారం వరకు ఉదయం 5:30 నుండి అర్ధరాత్రి 12 వరకు. గురువారాల్లో ఉదయం 5:30 నుండి 1 గంటల వరకు మరియు శుక్రవారం మధ్యాహ్నం 2 నుండి 1 గంటల వరకు నడుస్తుంది.
పింక్ లైన్ సేవ మరియు ఆరెంజ్ లైన్ స్టేషన్లలో అల్ సీఫ్, క్రెసెంట్ పార్క్, లుసైల్ బౌలేవార్డ్, అల్ మహా ద్వీపం మరియు ఇతరులతో సహా లుసైల్‌లోని అనేక ప్రాంతాల గమ్యస్థానాలకు ప్రజలు నేరుగా ప్రయాణించడానికి ట్రామ్‌ను ఉపయోగించగలరు. అలాగే లెగ్టైఫియా స్టేషన్ ద్వారా మెట్రో నెట్వర్క్కి కనెక్ట్ అవుతుందను మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..