ఛార్జీలు పెంచకుండానే హైదరాబాద్ మెట్రో షాక్..
- April 07, 2024
హైదరాబాద్: హైదరాబాద్ లో ట్రాఫిక్ చిక్కులు లేకుండా తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరాలంటే ఉన్న మార్గాల్లో మెట్రోరైలు ఒకటి. ఉదయం, సాయంత్రం వేళల్లో, సెలవు రోజుల్లో ప్రయాణికులతో మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఇటీవల కొద్ది రోజులుగా ఎండలు మండిపోతుండడంతో చాలా మంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఈ సమయంలో హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రయాణికులకు షాకిచ్చారు.
ఛార్జీలు పెంచకుండానే ప్రయాణికులపై కొంత భారం వేశారు. సూపర్ సేవర్ హాలీడే కార్డ్(రూ.59)ను పూర్తిగా రద్దు చేశారు. మార్చి 31తో ఈ ఆఫర్ ముగిసిందని తెలిపారు. ఈ కార్డుతో రూ.59 చెల్లించి ఒక రోజంతా నగరంలోని మెట్రో రైళ్లలో అపరిమితంగా ప్రయాణించే అవకాశం ఉండేది. ఆదివారం, రెండో శనివారంతో పాటు ఇతర సెలవు రోజుల్లో ఈ సౌలభ్యం అందుబాటులో ఉండేది.
అలాగే.. మెట్రోకార్డుపై ఇస్తున్న 10శాతం రాయితీని పూర్తిగా ఎత్తివేశారు. కాగా.. గతేడాది ఏప్రిల్‌లో రద్దీ వేళల్లో మెట్రోకార్డు పై ఇస్తున్న రాయితీని ఎత్తివేయగా.. ఇప్పుడు పూర్తిగా తొలగించారు. రాయితీలను రద్దు చేయడంతో ప్రయాణికుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అదే సమయంలో కోచ్‌ల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..