వడదెబ్బ బారినపడుతున్న ఆర్టీసీ ఉద్యోగులు
- April 07, 2024
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. మార్చి రెండో వారం నుండే ఎండలు విపరీతం కాగా..ఏప్రిల్ మొదటివారం లో మరింత పెరిగాయి. ముఖ్యంగా తెలంగాణ లోని పలు జిల్లాలో 40 డిగ్రీలపైగా ఎండలు కొడుతున్నాయి. ఈ ఎండలకు భయపడి ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావాలంటే భయపడుతున్నారు. విపరీతమైన వేడి కారణంగా అత్యవసరమైతే తప్ప, జనం ఇళ్లుదాటి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. అదికూడా చెట్లనీడను ఆశ్రయిస్తూ రాకపోకలు సాగిస్తున్నారు. చిరు వ్యాపారులు మఽధ్యాహ్నం సమయంలో దుకాణాలు మూసి ఉంచుతున్నారు.
ఏప్రిల్లోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎండవేడి మరింతగా పెరిగే అవకాశాలు ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు. విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వాతావారణ శాఖ జిల్లా వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి అయితే మరి దారుణంగా ఉంది. పైన ఎండ..కింద ఇంజన్ వేడితో డ్రైవర్లు నరకం చూస్తున్నారు. దీంతో ప్రతి రోజు అనేక మంది వడదెబ్బ కు గురి అవుతున్నారు. శనివారం గరిష్టంగా 44.4 డిగ్రీలు, కనిష్టంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







