రెండో అతి పెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తా: సిఎం స్టాలిన్
- April 08, 2024
తమిళనాడు: తమిళనాడులో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె.స్టాలిన్ హామీ ఇచ్చారు. తమ పార్టీ (డీఎంకే) 2024 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయాన్ని పొందుపరుస్తున్నట్లు స్టాలిన్ వెల్లడించారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో అత్యాధునిక హంగులతో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపడతామని స్టాలిన్ ట్విటర్ వేదికగా ప్రకటించారు.
”క్రికెట్ ఔత్సాహికుడినైన నేను ఎలక్షన్స్ 2024 కోసం మా ఎన్నికల మేనిఫెస్టోలో మరో వాగ్దానాన్ని జోడించాలనుకుంటున్నాను. కోయంబత్తూరులోని క్రీడాభిమానుల చురుకైన భాగస్వామ్యంతో అత్యాధునిక క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తాను. ఈ స్టేడియాన్ని చెన్నై చిదంబరం స్టేడియం తర్వాత తమిళనాట రెండో అతి పెద్ద అంతర్జాతీయ క్రికెట్ వేదికగా తీర్చిదిద్దుతాను. క్రీడల మంత్రి ఉదయ్ స్టాలిన్ రాష్ట్రంలో ప్రతిభను పెంపొందించడానికి, క్రీడా మౌలిక సదుపాయాలు సమకూర్చడానికి కట్టుబడి ఉన్నాడు.” అంటూ స్టాలిన్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..