ఈద్ అల్ ఫితర్ సెలవుల్లో వర్షం కురుస్తుందా?

- April 08, 2024 , by Maagulf
ఈద్ అల్ ఫితర్ సెలవుల్లో వర్షం కురుస్తుందా?

యూఏఈ: 2024 రమదాన్‌కు వీడ్కోలు పలికేందుకు యూఏఈలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈద్ అల్ ఫితర్ సందర్భంగా వాతావరం చల్లబడనుంది. చంద్రుడు కనిపించడం బట్టి ఈద్ మంగళవారం (ఏప్రిల్ 9) లేదా బుధవారం (ఏప్రిల్ 10) కావచ్చు. ఉత్సవాలకు సన్నాహాలు ముమ్మరంగా కొనసాగుతున్నందున, ఈద్ సెలవు వారంలో యూఏఈలో వర్షాలు పడే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రెండు రోజులు మేఘావృతమై ఉండవచ్చని, మంగళవారం కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొత్తంమీద వాతావరణ సూచనల ప్రకారం దేశంలో పండుగ రోజున కొంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో తేమ కొద్దిగా తగ్గుతుందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ (NCM) నుండి వాతావరణ నిపుణుడు డాక్టర్ అహ్మద్ హబీబ్ తెలిపారు. దేశంలోని చెల్లాచెదురుగా ఉన్న ప్రాంతాలలో నెల మొదటి భాగంలో పొగమంచు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని, అయితే ఏప్రిల్ రెండవ వారంలో తగ్గుతుందన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com