మక్కా గ్రాండ్ మసీదు వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం
- April 09, 2024
సౌదీ: మక్కాలోని మస్జిద్ అల్ హరామ్ పై అంతస్తు నుంచి ఓ వ్యక్తి దూకినట్లు మక్కా ప్రాంతంలోని సెక్యూరిటీ అథారిటీ మంగళవారం ఉదయం ప్రకటించింది. ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. గ్రాండ్ మసీదు భద్రత కోసం ప్రత్యేక దళం కేసుపై దర్యాప్తు ప్రారంభించింది. ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం వారు వెల్లడించలేదు.
2017లో ఒక సౌదీ వ్యక్తి కాబా ముందు మసీదు ప్రాంగణంలో తనను తాను నిప్పంటించుకోవడానికి ప్రయత్నించాడు. కాని భద్రతా దళాలు అతన్ని అడ్డుకున్నాయి. 2018లో మూడు వేర్వేరు ఆత్మహత్యలకు సంబంధించిన సంఘటనలు జరిగాయి. జూన్ ప్రారంభంలో ఒక ఫ్రెంచ్ వ్యక్తి మసీదు పైకప్పుపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వారం రోజుల తర్వాత బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి కూడా అదే రీతిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అదే సంవత్సరం ఆగస్టులో ఒక అరబ్ వ్యక్తి గ్రాండ్ మసీదు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







