‘బిచ్చగాడు’ హీరో భలే ప్లాన్ చేశాడే.!
- April 10, 2024
తమిళ హీరో విజయ్ ఆంటోనీ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు ‘బిచ్చగాడు’ సినిమాతో. తెలుగులోనూ మంచి కలెక్షన్లు రాబట్టింది ఈ సినిమా. ఆ సినిమా తర్వాత విజయ్ ఆంటోనీ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతూ వచ్చారు.
తాజాగా ‘లవ్ గురు’ అనే సినిమాలో నటించాడు విజయ్ ఆంటోనీ. ఈ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈలోపే ఈ సినిమాకి స్పెషల్ షోస్ వేయించాడు విజయ్ ఆంటోనీ.
అది కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌కి ప్రత్యేకంగా. ప్రెస్‌కి సంబంధించిన కొద్దిమంది ఫ్యామిలీస్‌కి ఈ సినిమాని దగ్గరుండి చూపించాడు. వాళ్ల మౌత్ టాక్ తీసుకున్నాడు. ఫ్యామిలీస్‌తో బాగా కలిసిపోయి తన సినిమాని సరికొత్తగా ప్రమోట్ చేసుకున్నాడు విజయ్ ఆంటోనీ. మంచి టాక్ వచ్చింది. కూల్ ఫ్యామిలీ మూవీగా ఆడియన్స్ సర్టిఫికెట్ ఇచ్చారు.
చెల్లెలి సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాకి ప్రీ రిలీజ్ రెస్పాన్స్ బాగా రావడంతో, సినిమాపై అంచనాలు పెరిగాయ్. ఈ శుక్రవారం రిలీజ్ కాబోయే తెలుగు సినిమాలతో పాటూ, ‘లవ్ గురు’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. చూడాలి మరి, విజయ్ ప్రమోషన్ ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో.!
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!