‘బిచ్చగాడు’ హీరో భలే ప్లాన్ చేశాడే.!
- April 10, 2024తమిళ హీరో విజయ్ ఆంటోనీ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు ‘బిచ్చగాడు’ సినిమాతో. తెలుగులోనూ మంచి కలెక్షన్లు రాబట్టింది ఈ సినిమా. ఆ సినిమా తర్వాత విజయ్ ఆంటోనీ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతూ వచ్చారు.
తాజాగా ‘లవ్ గురు’ అనే సినిమాలో నటించాడు విజయ్ ఆంటోనీ. ఈ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈలోపే ఈ సినిమాకి స్పెషల్ షోస్ వేయించాడు విజయ్ ఆంటోనీ.
అది కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌కి ప్రత్యేకంగా. ప్రెస్‌కి సంబంధించిన కొద్దిమంది ఫ్యామిలీస్‌కి ఈ సినిమాని దగ్గరుండి చూపించాడు. వాళ్ల మౌత్ టాక్ తీసుకున్నాడు. ఫ్యామిలీస్‌తో బాగా కలిసిపోయి తన సినిమాని సరికొత్తగా ప్రమోట్ చేసుకున్నాడు విజయ్ ఆంటోనీ. మంచి టాక్ వచ్చింది. కూల్ ఫ్యామిలీ మూవీగా ఆడియన్స్ సర్టిఫికెట్ ఇచ్చారు.
చెల్లెలి సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాకి ప్రీ రిలీజ్ రెస్పాన్స్ బాగా రావడంతో, సినిమాపై అంచనాలు పెరిగాయ్. ఈ శుక్రవారం రిలీజ్ కాబోయే తెలుగు సినిమాలతో పాటూ, ‘లవ్ గురు’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. చూడాలి మరి, విజయ్ ప్రమోషన్ ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో.!
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు