బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు.. కీలక సూత్రధారుల అరెస్ట్
- April 12, 2024
బెంగళూరు: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడుకు పాల్పడిన ఇద్దరిని ఎన్ఏఐ అరెస్ట్ చేసింది. ఈ బాంబు పేలుడు ఘటనలో సూత్రధారి అయిన అబ్దుల్ మతీన్ తహా, ముసావీర్ హుస్సేన్‌ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని కాంతి వద్ద వీరిద్దరిన అరెస్టు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ శుక్రవారం (ఏప్రిల్ 12) తెలిపింది.
బెంగాల్, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు చెందిన కేంద్ర నిఘా సంస్థలు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ముస్సావిర్ హుస్సేన్ షాజేబ్, అబ్దుల్ మతీన్ తాహాలు కోల్‌కతాకు వెళ్తున్న సమయంలో పట్టుబడ్డారని ఎన్ఐఏ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ బాంబు పేలుడు ఘటన కేసులో మతీన్ తాహా ప్రమేయం ఉందని గుర్తించింది. అంతేకాదు.. 2020 ఉగ్రవాదం కేసులో కూడా వీరికి ప్రమేయం ఉందని తెలిపింది. ఈ కేసులో కీలక సూత్రధారులైన వీరిద్దరిని అరెస్టు చేయగా.. గత నెలలో షాజేబ్, తాహాలకు సహకరించిన ముజమ్మిల్ షరీఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లోని 18 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించిన తర్వాత కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో షాజేబ్, తాహా నివాసితులుగా గుర్తించారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







