జెడ్డా హిస్టారిక్ డిస్ట్రిక్ట్ సందర్శించిన 2.5 మిలియన్ల పర్యాటకులు

- April 13, 2024 , by Maagulf
జెడ్డా హిస్టారిక్ డిస్ట్రిక్ట్ సందర్శించిన 2.5 మిలియన్ల పర్యాటకులు

జెడ్డా: జెద్దా హిస్టారిక్ డిస్ట్రిక్ట్ రమదాన్ సీజన్‌లో 2.5 మిలియన్లకు పైగా సందర్శకులు సందర్శించారు.  సందర్శకులు పోటెత్తడంతో  830 మంది ఉద్యోగులు 250,000 కంటే ఎక్కువ గంటలు శ్రమించారు. 600 కంటే ఎక్కువ శుభ్రపరిచే యంత్రాలను ఉపయోగించారు. 16,000 లీటర్ల కంటే ఎక్కువ పర్యావరణ అనుకూలమైన క్లీనింగ్ ఏజెంట్లను ఉపయోగించారు. మొత్తంగా 1,900 టన్నుల వ్యర్థాలు మరియు 70 టన్నుల కార్డ్‌బోర్డ్ సమర్ధవంతంగా ప్రాసెస్ చేసి వేస్ట్ మేనేజ్‌మెంట్  నిర్వహించారు. 2.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, జెడ్డా హిస్టారిక్ డిస్ట్రిక్ట్ మౌలిక సదుపాయాల మెరుగుదలలు, భవన పునరుద్ధరణలు, విభిన్న సాంస్కృతిక కార్యక్రమాల క్యాలెండర్‌తో సహా గణనీయమైన పునరుజ్జీవనం పొందుతోంది. ఇది ఆకర్షణీయమైన అనుభవాన్ని కోరుకునే సందర్శకులకు ప్రధాన గమ్యస్థానంగా  మారుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com