గౌరవ డాక్టరేట్ అందుకున్న గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్
- April 14, 2024
చెన్నై: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో భాగంగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డీజీ సీతారాం చేతుల మీదుగా డాక్టరేట్ ప్రదానం స్వీకరించారు. ఇకపై రామ్ చరణ్ కాస్త డాక్టర్ రామ్ చరణ్‌గా మారారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో తమ అభిమాన నటుడికి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తండ్రికి తగ్గ వారసులు అని మెచ్చుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
కాగా RRR మూవీతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్ మరో ఖ్యాతిని అందుకున్నారు. చిన్న వయస్సులోనే గౌరవ డాక్టరేట్ అందుకొని అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 80శాతం పూర్తి అయింది. ఈ ఏడాదిలోనే మూవీని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలోనూ, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలోనూ హీరోగా చేయనున్నారు. తక్కువ కాలంలోనే మూడు సినిమాలతో అభిమానులను అలరించనున్నారు.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







