యూఏఈలో మరో రెండు రోజులపాటు వర్షాలు..!

- April 16, 2024 , by Maagulf
యూఏఈలో మరో రెండు రోజులపాటు వర్షాలు..!

యూఏఈ: ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు  యూఏఈని అతలాకుతలం చేశాయి. అయితే బుధవారం వరకు అస్థిర వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ హెచ్చరించింది.  భారీ వర్షం మరియు శక్తివంతమైన గాలుల శబ్దంతో సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మేల్కొన్నట్లు అబుదాబి నివాసి జలాలీ తన సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నాడు.  అబుదాబి, దుబాయ్, షార్జా, ఫుజైరా మరియు రస్ అల్ ఖైమాలోని నివాసితులు అల్పపీడనం కారణంగా వర్షపాతం నమోదైంది. అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం, జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం, అల్ బతీన్ విమానాశ్రయం మరియు షార్జా మరియు ఫుజైరాలోని విమానాశ్రయాలతో సహా కీలక విమానాశ్రయాలపై ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా ఏప్రిల్ 16న యూఏఈలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ రిమోట్‌గా పని చేయాలని ఆదేశించారు. మరోవైపు ప్రైవేట్ రంగ సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.  అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా దుబాయ్‌లోని అన్ని ప్రైవేట్ పాఠశాలలను రిమోట్ లెర్నింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతించాలని ప్రభుత్వ సంస్థలను కూడా ఆదేశించింది.  దేశవ్యాప్తంగా అస్థిర వాతావరణ పరిస్థితులు తీవ్రమవుతున్నందున యూఏఈ నుండి బయలుదేరే కొన్ని విమానాలు ఆలస్యం కావచ్చని ఎయిర్‌లైన్ ప్రతినిధులు తెలిపారు. అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ ఏప్రిల్ 15-16 తేదీలలో భారీ వర్షాలు కొన్ని విమానాలను ఆలస్యం చేసే అవకాశం ఉందని తెలిపింది. ప్రయాణీకులు ఎయిర్‌లైన్ వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయాలని మరియు సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com