ఇండియన్ ‘అరేనా’తో జట్టుకట్టిన కువైట్ నేషనల్ బ్యాంక్

- April 16, 2024 , by Maagulf
ఇండియన్ ‘అరేనా’తో జట్టుకట్టిన కువైట్ నేషనల్ బ్యాంక్

కువైట్: భారతదేశం యొక్క ఇంటెలెక్ట్ డిజైన్ అరేనా లిమిటెడ్ తో ఇంటెలెక్ట్ గ్లోబల్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ (iGTB) సిస్టం కోసం నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (NBK) భాగస్వామ్యాన్ని విస్తరించింది. ఇప్పటికే ఉన్న ఛానెల్‌లను ఆధునీకరించడం, లావాదేవీలలో కొత్త డిజిటల్ సామర్థ్యాలను పెంపొందించడం దీని లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం లావాదేవీల వాల్యూమ్‌ల పరంగా బ్యాంక్‌కి ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు. కువైట్ మరియు మిడిల్ ఈస్ట్‌లో NBK విస్తరణను ఇది వేగవంతం చేస్తుందని ఇంటెలెక్ట్ డిజైన్ ఎరీనా ఒక ప్రకటనలో తెలిపింది. కువైట్‌లోని డిజిటల్ లావాదేవీ బ్యాంకింగ్ రంగంలో iGTB మెరుగైన స్థానాన్ని కొత్త ఒప్పందం హైలైట్ చేస్తుందని iGTB చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మనీష్ మకాన్ తెలిపారు.  ఇదిలా ఉండగా, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో గత ముగింపు రూ.996.95తో పోలిస్తే ఈరోజు ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా షేరు ధర 5.32% పెరిగి తాజా గరిష్ట స్థాయి రూ.1050కి చేరుకుంది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.14,008 కోట్లకు చేరుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com