'ప్రతినిధి 2' సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదుల
- April 17, 2024
హైదరాబాద్: 'ప్రతినిధి 2'తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నారా రోహిత్. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని మూర్తి దేవగుప్తపు తెరకెక్కించారు.
సురేంద్రనాథ్ బొల్లినేని, కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట నిర్మించారు. సిరీ లెల్ల కథానాయిక. సప్తగిరి, జిషు సేన్ గుప్తా, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 25న థియేటర్లలోకి రానుంది.
ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర తొలి గీతాన్ని మంగళవారం విడుదల చేశారు. ''గల్లా ఎత్తి నిజం చెప్పే హీరోలకు సలాం కొట్టు.. కల్లాబొల్లి మాటలు జెప్పే కాకీ గోల ఎల్లాగొట్టు'' అంటూ సాగిన ఈ పాటకు మహతి స్వర సాగర్ బాణీలు సమకూర్చారు. కాసర్ల శ్యామ్ సాహిత్యమందించారు.
రామ్ మిరియాల ఆలపించగా.. భాను మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న ఆసక్తికర కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో నారా రోహిత్ నిజాయతీ గల న్యూస్ రిపోర్టర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు: మూర్తి, కూర్పు: రవితేజ గిరిజాల, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష