ఉక్రెయిన్‌ పై రష్యా క్షిపణుల దాడి..17 మంది మృతి

- April 18, 2024 , by Maagulf
ఉక్రెయిన్‌ పై రష్యా క్షిపణుల దాడి..17 మంది మృతి

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉత్తర ఉక్రెయిన్ లోని చెర్నిహిల్ నగరంపై బుధవారం రష్యా మూడు క్షిపణులను ప్రయోగించింది. అవి ఎనిమిది అంతస్తుల భవనంపై పడటంతో 17 మంది మృతిచెందారు. 61 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీస్ తెలిపింది. చెర్నివ్ రాజధాని కీవ్‌కు ఉత్తరాన 150 కిలోమీటర్ల దూరంలో రష్యా – బెలారస్ సరిహద్దులకు సమీపంలో ఉంది. ఇరుదేశాల మధ్య 2022, ఫిబ్రవరిలో ప్రారంభమైన యుద్ధం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. రష్యా భారీస్థాయిలో దాడులు నిర్వహిస్తుండగా, ఆయుధాల కొరతతో ఇబ్బండి పడుతున్న ఉక్రెయిన్‌ దళాలులు చాలా ప్రాంతాల్లో వెనక్కి మళ్లుతున్నాయి. రష్యా దాడితో భవనాలు పెద్ద సంఖ్యలో దెబ్బతిన్నాయని ఉక్రెయిన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి ఇహోర్‌ క్లమెంకో తెలిపారు. కార్లు, మున్సిపల్‌ ఇన్ఫ్రాస్టక్చర్‌ పూర్తి ధ్వంసమయ్యాయని వెల్లడించారు ప్రస్తుతం ఆ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతున్నదని చెప్పారు. ఇస్కాండర్ క్రూయిజ్ క్షిపణులతో రష్యా ఈ దాడి చేసింది. ఉక్రెయిన్ రాజధాని కైవ్ సిటీ నుంచి చెర్నిహిల్150 కి.మీ, రష్యా సరిహద్దు నుంచి దాదాపు 80 కి.మీ దూరంలో ఉంటుంది. ఉక్రెయిన్ స్థానిక సమయం ప్రకారం ఉదయం 9 గంటలకు స్కూల్స్, హాస్పిటల్, ఇళ్లు ఉండే ప్రాంతంలో మూడు క్షిపణులతో దాడి చేసింది. ఈ ప్రమాదంలో ఒక హోటల్ ధ్వంసమైందని అధికారులు తెలిపారు. నివాస భవనాలు, ఆసుపత్రి, విద్యా సౌకర్యం, డజన్ల కొద్దీ ప్రైవేట్ కార్లు దెబ్బతిన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com