తమన్నా డైరీ ఇప్పట్లో ఖాళ్లీ అయ్యేదే లే.!
- April 18, 2024
మిల్కీ బ్యూటీ తమన్నా వరుస ప్రాజెక్టులతో బిజీగా వుంది. ఎప్పుడో తమన్నా పనైపోయిందనుకున్నారంతా. కానీ, ఇప్పట్లో ఆమె డైరీ ఖాళీ అయ్యేదే లే.!
వరుస ప్రాజెక్టులు ఓకే చేసేసింది తమన్నా. ఇప్పటికే తమిళంలో మూడు ప్రాజెక్టులు, తెలుగులో ఒకటి, హిందీలో ఇంకోటీ తమన్నా చేతిలో వున్నాయ్.
వాటిలో కొన్ని హారర్ మూవీస్ కూడా వున్నాయ్. డిఫరెంట్ గెటప్స్‌లో తమన్నా మెప్పించబోతోంది భవిష్యత్‌లో. వీటితో పాటూ, ఓ బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ తమన్నా తలుపు తట్టింది.
బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ నీరజ్ పాండే తెరకెక్కించబోయే ఓ వెబ్ సిరీస్ కోసం తమన్నాని సెలెక్ట్ చేశాడట. మూడు నుంచి ఐదు పార్టులుగా ఈ వెబ్ సిరీస్ రూపొందబోతోందట.
మొదటి పార్ట్ సిరీస్ ఈ ఏడాదిలోనే స్టార్ట్ చేయనున్నారట. అలా లెక్కేసుకుంటే.. మరో నాలుగైదేళ్లు తమన్నా డైరీ ఖాళీ అయ్యేదేలేదు.! ఇవిలా వుంటే, ఎప్పటికప్పుడే కొత్త కొత్త ప్రాజెక్టుల కోసం తమన్నా పేరు ప్రస్థావనకొస్తూనే వుంది. స్పెషల్ సాంగ్స్ కావచ్చు.. స్పెషల్ రోల్స్ కావచ్చు.. తమన్నాని మేకర్లు హోల్డ్‌లోనే వుంచుతున్నారు. దటీజ్ తమన్నా.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







