నారా రోహిత్ స్పీడు పెంచాడు.!
- April 18, 2024
కంటెంట్ బేస్ హీరోగా పేరు తెచ్చుకున్న నారా రోహిత్.. ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. ఇటీవలే ‘ప్రతినిధి 2’తో మళ్లీ నారా రోహిత్ పేరు తెర పైకి వచ్చింది.
న్యూస్ రిపోర్టర్ మూర్తి డైరెక్టర్‌గా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘ప్రతినిధి 2’. నారా రోహిత్ కెరీర్ మొదట్లో వచ్చిన ‘ప్రతినిధి’ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న సినిమానే ‘ప్రతినిధి 2’.
ఈ సినిమాతో మళ్లీ సంచనాలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు నారా రోహిత్. ఇదిలా వుంటే, నారా రోహిత్ మరో నాలుగు ప్రాజెక్టులు సిద్ధం చేసి వుంచాడట.
సైలెంట్‌గా ఆయా ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాడట. తాజాగా అందులో ఒకటి ‘సుందరకాండ’ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు.
‘ఇది నా కథ.. ప్రేమకథ.’ అంటూ పలు సక్సెస్‌ఫుల్ లవ్ స్టోరీలను ప్రస్థావిస్తూ డిజైన్ చేసిన ఈ సినిమా టీజర్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అనేలా వుంది ఈ టీజర్.
అప్పుడెప్పుడో వచ్చిన విక్టరీ వెంకటేష్ ‘సుందరకాండ’ సినిమా ప్రేక్షకులపై మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అదో అద్భుతమైన కావ్యం. ఇప్పుడు మళ్లీ నారా రోహిత్ చేయబోయే ఈ ‘సుందరకాండ’ కూడా ఈ జనరేషన్‌కి అద్భుతం అవుతుందా.? చూడాలి మరి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?