తుఫాను ఫోటోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ

- April 18, 2024 , by Maagulf
తుఫాను ఫోటోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ

దుబాయ్: యూఏఈ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇటీవలి వరదల ప్రతికూల చిత్రాలు లేదా పుకార్లను పోస్ట్ చేయడం దేశంలోని సైబర్ క్రైమ్ చట్టాల ప్రకారం నేరం. ఆన్‌లైన్‌లో ఎమిరేట్స్ ప్రతిష్టను దెబ్బతీస్తే శిక్షార్హమైన జైలు శిక్ష మరియు 1 మిలియన్ దిర్హామ్‌లు జరిమానా విధించబడుతుందని ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ వెల్లడించింది. సోషల్ మీడియాలో కొందరు పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని అధికారులు తెలిపారు.

ఈ వారం ప్రారంభంలో గల్ఫ్ ను భారీ తుఫానులు అతలాకుతలం చేశాయి. వరదలు పోటెత్తడంతో విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ క్రమంలో వరదలు ముంచెత్తిన రోడ్లు, నీటిలో మునిగిన కార్ల చిత్రాలను పలువురు షేర్ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com