ప్రబాస్ - మారుతి.! ఇప్పట్లో లేనట్లే.!

- April 18, 2024 , by Maagulf
ప్రబాస్ - మారుతి.! ఇప్పట్లో లేనట్లే.!

డైరెక్టర్ మారుతితో కలిసి ప్రబాస్ ‘రాజా సాబ్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సైలెంట్‌గా షూటింగ్ జరిగిపోతోంది. ఈ సినిమా నుంచి రేపో మాపో అప్డేట్ వస్తుందట.. అని ప్రచారం జరుగుతోంది.

అయితే, అలాంటిదేమీ లేదని డైరెక్టర్ మారుతి కన్‌ఫామ్ చేశారు. కానీ, సినిమా షూటింగ్ మాత్రం సూపర్ ఫాస్ట్‌గా జరిగిపోతోందట. వింటేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఓ బంగ్లాలోనే జరిగే కథగా ఈ సినిమా గురించి చెబుతున్నారు.

ఇంతవరకూ ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప ఇంకే వివరాలు ఈ సినిమా గురించి వెల్లడి చేయలేదు. హారర్ కామెడీ థ్రిల్లర్ అని ప్రచారం జరుగుతోంది.

మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనుపమ పేరు కూడా వినిపిస్తోంది. అసలు మ్యాటర్ ఏంటంటే,  మేలో రిలీజ్ కాబోయే ‘కల్కి’ సినిమా తర్వాతే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్లు రిలీజ్ చేస్తారట.

అంతవరకూ ఏ ప్రచారం జరిగినా అందులో ఎలాంటి నిజమూ వుండదని మేకర్లు స్పష్టం చేశారు. ‘కల్కి’ సినిమా తర్వాత ఆడియో సింగిల్ రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ‘రాజా సాబ్’ రిలీజ్ వుండే అవకాశాలున్నాయ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com