‘తండేల్’ రిలీజ్ డేట్ అలా ఫిక్స్ చేశారు..!
- April 18, 2024
నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘తండేల్’. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ సినిమా కోసం నాగ చైతన్య కంప్లీట్ మేకోవర్‌తో కనిపిస్తున్నాడు. స్లాంగ్ కూడా మార్చేశాడు. పూర్తిగా ఉత్తరాంధ్ర యాసలో డైలాగులు పలుకుతున్నాడు.
మొన్నా మధ్య రిలీజ్ చేసిన గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.
కాగా, ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ, అంతకన్నా ముందే.. అంటే ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. డిశంబర్‌లోనే సినిమాని రిలీజ్ చేయబోతున్నారట.
అది కూడా క్రిస్‌మస్ సందర్భంగా. డిశంబర్ 20న ‘తండేల్’ రిలీజ్ చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారట. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో.
తాజా వార్తలు
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!