తేజ సజ్జా మరో సంచలనం.!
- April 18, 2024
‘హనుమాన్’ సినిమాతో తేజ సజ్జా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు మరో సంచలనానికి శ్రీకారం చుట్టేస్తున్నాడు తేజ సజ్జా.
తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. అదే ‘మిరాయ్’. పేరు చిత్రంగా వున్నా.. ఓ సూపర్ యోధుడి కథగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. పీరియాడిక్ బేస్‌లో నడుస్తున్న ఈ సినిమా వాస్తవానికి ‘హనుమాన్’ సినిమా కన్నా ముందే రిలీజ్ కావల్సి వుందట. కానీ, కొన్ని కారణాల వల్ల లేట్ అయ్యిందట.
కార్తీక్ ఘట్టమనేని ఇటీవల ‘ఈగల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేదు. ప్రస్తుతం తేజ సజ్జాకున్న ఇమేజ్‌తో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయ్. త్వరలోనే సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







