మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు

- April 20, 2024 , by Maagulf
మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు

న్యూయార్క్: మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఖతార్ అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. అన్ని దేశాలు సంయమనం పాటించాలని కోరింది.  గత కొన్నిరోజులుగా ఈ ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనకరమైన పరిణామాలపై విచారం వ్యక్తం చేసింది. త్రైమాసిక బహిరంగ చర్చకు ముందు "మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితి’’ పై న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో చర్చించారు. గాజా స్ట్రిప్‌లోని పరిస్థితిని అదుపు చేయాలని పిలుపునిచ్చారు.  బాధితులకు ఆహారం మరియు అవసరమైన సేవలను అందజేయాలని కోరారు. రఫా నగరంలో ఇజ్రాయెల్ దళాలు ప్రారంభించిన సైనిక చర్యను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ దురక్రమణ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న గాజాకు తక్షణ సాయాన్ని అందించాలని HE షేఖా అల్యా అహ్మద్ బిన్ సైఫ్ అల్ థానీ  పిలుపునిచ్చారు.  గాజాలో మారణహోమాన్ని నిరోధించడానికి ఇజ్రాయెల్ పుష్కలంగా చర్యలు తీసుకోవడంపై అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) ఇచ్చిన తీర్పును అమలు చేయడం అత్యవసరమని  షేఖా అలియా అహ్మద్ బిన్ సైఫ్ అల్ థానీ పిలుపునిచ్చారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com