ఆవకాయ పచ్చడి తెచ్చిస్తాం..TSRTC కొత్త ఆఫర్
- April 21, 2024
హైదరాబాద్: వేసవి వచ్చిందంటే మన అమ్మమ్మ పెట్టిన ఆవకాయ పచ్చడే గుర్తొస్తుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా ఆవకాయ వేసి కాస్త నెయ్యి వేసి కలిపి తింటే ఆ రుచే వేరు. ఈ క్రమంలో అమ్మమ్మ చేసే కొత్త ఆవకాయను మిస్ అవుతున్నాం అనుకునే వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. రుచికరమైన అమ్మమ్మ చేతి ఆవకాయ పచ్చడిని మీ బంధువులు, స్నేహితులకు సులువుగా పంపించేలా ఏర్పాట్లు చేసింది.
ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. సమీపంలోని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్ల ద్వారా ఆవకాయ పచ్చడిని బంధుమిత్రులకు పంపించవచ్చని తెలిపారు. తెలంగాణతో పాటు టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరిగే ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు ఆవకాయ పచ్చడిని సంస్థ డెలివరీ చేస్తుందని చెప్పారు. పూర్తి వివరాలకు కాల్ సెంటర్ నెంబర్లు 040– 23450033, 040–69440000, 040–69440069 ను సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







