ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- April 24, 2024
: ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్ (సీపీ) గా పీహెచ్ డీ రామకృష్ణ ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణా పై నిన్న ఈసీ బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే.
వీరి స్థానంలో వేరే అధికారులను నియమించేందుకు వీలుగా ..ఒక్కో పోస్టుకు ముగ్గురేసి ఐపీఎస్ అధికారుల పేర్లతో బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా ప్యానల్ సమర్పించాలని సీఎస్ జవహార్ రెడ్డికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానెల్ ను పరిశీలించిన అనంతరం ఈసీ తుది నిర్ణయం తీసుకుంది. కొత్తాగ నియమితులైన అధికారులు గురువారం ఉదయం లోగా బాధ్యతలు చేపట్టాలి ఈసీ ఆదేశించింది.
పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ్ .. ఎన్నికల షెడ్యుల్ వచ్చిన తర్వాత కూడా వైసీపీకి అనుకూలంగా, ఏకపక్షంగా పని చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిన ఈసీ చివరికి వారిద్దరిపై బదిలీ వేటు వేసింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ వారికి ఎన్నికల సంబంధిత విధులేవీ అప్పగించవద్దని ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!







