ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ

- April 24, 2024 , by Maagulf
ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ

న్యూఢిల్లీ: ఒక‌వేళ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. అప్పుడు దేశ సంప‌ద‌ను ముస్లింల‌కు ఆ పార్టీ పంచిపెడుతుంద‌ని ఇటీవ‌ల రాజ‌స్థాన్‌లో జ‌రిగిన ఓ ఎన్నిక‌ల స‌భ‌లో ప్ర‌ధాని మోడీ పేర్కొన్న విష‌యం తెలిసిందే. తీవ్ర దుమారం రేపిన ఆ వ్యాఖ్య‌ల‌పై ప‌లు పార్టీలు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశాయి. అయితే ఆ ఫిర్యాదుల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు ఈసీ చెప్పింది. కాంగ్రెస్‌తో పాటు సీపీఐ పార్టీలు ప్ర‌ధాని మోడీ స్పీచ్‌పై ఫిర్యాదు చేశాయి. ఒక‌వేళ కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే, ప్ర‌జ‌ల సంప‌ద‌ను ముస్లింల‌కు పంచుతామ‌ని కాంగ్రెస్ తెలిపింద‌ని, దేశ వ‌న‌రుల‌పై తొలి హ‌క్కు మైనార్టీల‌కు ఉంటుంద‌ని మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌ధాని మోడీ పేర్కొన్నారు. ప్ర‌ధాని మోదీ చేసిన వివాదాస్ప‌ద ప్ర‌సంగాన్ని ప‌రిశీలిస్తున్నామ‌ని ఎన్నిక‌ల సంఘం వ‌ర్గాలు తెలిపాయి. మోడీ వ్యాఖ్య‌లు విద్వేష‌పూరితంగా, ఓ మ‌తాన్ని టార్గెట్ చేస్తున్న‌ట్లుగా ఉన్నాయ‌ని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఫిర్యాదును ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ప్ర‌ధానిపై ఈసీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీపీఐ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ సీతారాం ఏచూరి తెలిపారు. ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com