ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్‌కీ సపోర్టు వచ్చేసింది..

- April 25, 2024 , by Maagulf
ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్‌కీ సపోర్టు వచ్చేసింది..

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఐఓఎస్ యాప్ కోసం కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను ప్రవేశపెడుతోంది. యాప్ లేటెస్ట్ వెర్షన్‌లో ఐఫోన్ యూజర్ల కోసం పాస్‌కీ సపోర్టును రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. బీటా యూజర్లకు పాస్‌కీ సంబంధిత మెను పాప్‌అప్ కనిపిస్తుంది. మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ మొదట జనవరి 2024లో ఈ ఫీచర్‌పై టెస్టింగ్ ప్రారంభించింది. దాదాపు 3 నెలల తర్వాత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా iOS యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.

ముఖ్యంగా, ఆండ్రాయిడ్ యాప్ యూజర్లకు వాట్సాప్‌లో పాస్‌వర్డ్ లేని లాగిన్ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది. వాట్సాప్ యూజర్లు ఇప్పుడు ఫేస్ ఐడీ, టచ్ ఐడీ పాస్‌కోడ్‌ని ఉపయోగించి వారి అకౌంట్లలో లాగిన్ చేయొచ్చు. కంపెనీ సపోర్టు ఉన్న ఐఓఎస్ వెర్షన్లను పేర్కొననప్పటికీ, గత నివేదికలో iOS 17, ఆ తర్వాతి వెర్షన్‌లలో ఫీచర్‌కు సపోర్టు అందిస్తుంది. ఐఫోన్ ఎక్స్ఆర్ మోడల్ లేదా కొత్త వెర్షన్ కలిగిన యూజర్లు తమ అకౌంట్ కోసం పాస్‌కీని సెటప్ చేయొచ్చు.

పాస్‌కీ అనేది ఎస్ఎంఎస్ కోడ్‌ల వంటి సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే.. మెరుగైన భద్రతను అందించే అల్ట్రానేట్ లాగిన్ అథెంటికేషన్ మెథడ్. ఎఫ్ఐడీఓ అలయన్స్ రూపొందించిన ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలచే సపోర్టుతో ఈ టెక్నాలజీ పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీని ఉపయోగిస్తుంది. రెండు సెట్ల కీలు క్రియేట్ చేసుకోవచ్చు.

అందులో ఒకటి ప్లాట్‌ఫారమ్ క్లౌడ్‌లో స్టోర్ అవుతుంది. మరొకటి యూజర్ వద్ద ఉంటుంది. ఐఓఎస్ యూజర్ల కోసం యూజర్ కీ ఆపిల్ కీచైన్ సిస్టమ్‌లో స్టోర్ అవుతుంది. ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీ ఉపయోగించి ట్రిగ్గర్ అవుతుంది. రెండు కీలు సరిపోలినప్పుడు అకౌంట్ అథెంటికేషన్ అవుతుంది. ఫిషింగ్, ఇలాంటి మోసాలకు వ్యతిరేకంగా ఈ సిస్టమ్ ప్రభావవంతంగా పనిచేస్తుంది.

వాట్సాప్ పాస్‌కీని ఎలా సెటప్ చేయాలి? 
ఐఓఎస్‌లో వాట్సాప్ కోసం పాస్‌కీని సెటప్ చేయడం చాలా ఈజీ. వినియోగదారులు ముందుగా యాప్ లేటెస్ట్ వెర్షన్‌ను ఎంచుకోవాలి. కాకపోతే, ముందుగా యాప్‌ని అప్‌డేట్ చేయండి. ఈ కిందివిధంగా ట్రై చేయండి.

  • వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయండి.
  • స్క్రీన్ రైట్ బాటమ్ సెట్టింగ్స్ ట్యాబ్‌పై ట్యాప్ చేయండి.
  • అకౌంట్లలోకి వెళ్లండి.
  • పాస్‌కీలపై ట్యాప్ చేయండి. టాప్ నుంచి 4వ ఆప్షన్ ఎంచుకోవాలి.
  • నెక్స్ట్ స్క్రీన్‌లో దిగువన ఉన్న ‘Create Passkey’ బటన్‌పై క్లిక్ చేయండి.
  • మీరు ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీతో ప్రాంప్ట్ మెసేజ్ కనిపిస్తుంది. ‘Continue’ ట్యాప్ చేయండి. .
  • మీ పాస్‌కీ ఇప్పుడు యాక్టివ్‌గా ఉంది.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com