సోషల్ మీడియాను ఊపేస్తున్న స్పీడ్220 చిత్రం స్పెషల్ సాంగ్
- April 25, 2024
హైదరాబాద్: విజయలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఫణి కొండమూరి సమర్పణలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ స్పీడ్220. ఈ చిత్రానికి హర్ష బెజగం కథ-కథనం-దర్శకత్వం అందించారు. హేమంత్, గణేష్ ఇద్దరు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రీతి సుందర్, జాహ్నవి శర్మ కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తాజాగా ఓ స్పెషల్ సాంగ్ విడుదల అయింది. ప్రముఖ డాన్సర్ స్నేహ గుప్తా నర్తించిన బెజవాడలో బాలా కుమారి పాట ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది.
బెజవాడలో బాలాకుమారి, మిర్యాలగూడలో మీనా కుమారి అంటూ హిట్టు హిట్టు సూపర్ హిట్టు, నా ఫిగర్ కి ఒక్క లైక్ కొట్టు అనే మాస్ బీట్ గాయని గీతామాధురి ఆలపించారు. తన అధ్బుతమైన గాత్రనికి యంగ్ టాలెంటెడ్ డాన్సర్ స్నేహ గుప్తా తోడై డాన్స్ ను ఇరకొట్టింది. సంతోష్ కుమార్ బి రాసిన ఈ పాట కచ్చితంగా ఓ ట్రెండ్ సెట్ చేస్తుంది అని పాట వింటుంటే తెలుస్తోంది. దింతో స్పీడ్ 220 సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక చిత్రం టైటిల్ లోనే స్పీడ్ ఉంది కాబట్టి, చిత్రాన్ని కూడా ప్రేక్షకులకు స్పీడ్ గా అందించేందుకు షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా హర్ష బెజగం ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. అదేవిధంగా ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా తగ్గకుండా చిత్ర నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా సినిమాను గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. అతి త్వరలోనే ఈ చిత్రం అన్ని పనులు ముగించుకుని ప్రేక్షకుల ముందుకు రానుంది.
చిత్రం: స్పీడ్220
నిర్మాత: కె ఫణి, ఎమ్ సూర్యనారాయణ, ఎమ్ దుర్గ రావ్
హీరోలు: హేమంత్, గణేష్
హీరోయిన్స్: ప్రీతీ సుందర్, జాహ్నవి శర్మ
డ్యాన్సర్: స్నేహ గుప్తా
కొరియోగ్రాఫర్ : అషేర్ మామిడి
మ్యూజిక్ డైరెక్టర్: శేఖర్ మోపూరి
సింగర్ : గీతమాధురి
డీఓపీ : క్రాంతి కుమార్ కొణిదెన
పీఆర్ఓ : హరీష్, దినేష్
కథ-స్క్రీన్ ప్లే- డైరెక్షన్ : హర్ష బెజగం
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







