యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- April 29, 2024
యూఏఈ: నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ నివేదికల ప్రకారం.. యూఏఈలోని కొన్ని ప్రాంతాలలోని నివాసితులు భారీ నుండి మోస్తరు వర్షపాతం, అలాగే వడగళ్ల వానను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 16న ఎమిరేట్స్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైన తర్వాత, ఆదివారం అస్థిర వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో నివాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. NCM ప్రకారం.. దుబాయ్‌లోని అల్ ఖుద్రా రహదారిపై సాయంత్రం 4 గంటలకు భారీ నుండి మోస్తరు వర్షపాతం కురిసింది. స్టార్మ్ సెంటర్ దాని సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో వీడియోలను షేర్ చేసింది. భారీ వర్షం కారణంగా బలమైన గాలులు వీచాయని పేర్కొంది. ఖుద్రా ప్రాంతంతో పాటు ఎమిరేట్స్ రోడ్‌లో జెబెల్ అలీ మరియు సైహ్ అల్ సలామ్ వైపు వెళ్లే వాహనదారులు కూడా భారీ నుండి మోస్తరు వర్షాలు కురిసారు. అల్ ఐన్‌లో, వేడెక్కుతున్న ఉష్ణోగ్రతల మధ్య వడగళ్ళు కురిసినట్లు తెలిపింది. గార్డెన్ సిటీకి ఉత్తరాన ఉన్న అల్ షువైబ్‌లో వడగళ్ల వాన పడినట్లు స్టార్మ్ సెంటర్ వీడియోలు షేర్ చేసింది. మరోవైపు NCM దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను జారీ చేసింది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అబుదాబి పోలీసులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..