సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య

- April 29, 2024 , by Maagulf
సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య

రియాద్: సౌదీ అరేబియా పర్యాటక శాఖ మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ రియాద్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ప్రత్యేక సమావేశంలో "వెకేషనోమిక్స్" పేరుతో చర్చా సందర్భంగా దేశ పర్యాటక రంగంలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేసినట్లు ప్రకటించారు. 2024 మొదటి త్రైమాసికంలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్యలో గణనీయమైన వృద్ధి నమోదైనట్టు అల్-ఖతీబ్ తెలిపారు.  పర్యాటకుల ఖర్చు 17% కంటే ఎక్కువ పెరిగిందన్నారు. గత సంవత్సరం దాని పర్యాటక ఆదాయాన్ని $34 బిలియన్ల నుండి $66 బిలియన్లకు చేరిందన్నారు. ప్రస్తుత సంవత్సరానికి టూరిజం ద్వారా 80 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని చేరుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు చెప్పారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com