యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!

- April 29, 2024 , by Maagulf
యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!

యూఏఈ: రాబోయే రోజుల్లో అక్కడక్కడా అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, అప్పుడప్పుడు మెరుపులు, ఉరుములు, వడగళ్లు కురిసే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ (NCM) వాతావరణ నిపుణుడు డాక్టర్ అహ్మద్ హబీబ్ తెలిపారు. అయితే,ఏప్రిల్ 16న నాటి పరిస్థితులు వచ్చే అవకాశం లేదని నిపుణుడు తెలిపారు.తూర్పు ప్రాంతాలపై కూడా వడగళ్ళు వచ్చే అవకాశం ఉందని, ఇది కొన్ని అంతర్గత మరియు పశ్చిమ ప్రాంతాలకు విస్తరించవచ్చని వివరించారు.  మే 2న అస్థిరమైన వాతావరణం ఉండే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో  భారీ వర్షం పడుతుందని అంచనా వేశారు. క్లౌడ్ కవర్ క్రమంగా దుబాయ్ మరియు షార్జాతో సహా లోతట్టు ప్రాంతాల వైపు కదులుతుందని హబీబ్ తెలిపారు. శుక్రవారం-శనివారాల్లో అల్పపీడనం క్రమంగా దక్షిణం వైపు కదులుతుందని, అప్పుడు మేఘాల పరిమాణం క్రమంగా తగ్గుతుందని, సాధారణంగా మోస్తరు వర్షం కురుస్తుందని చెప్పారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com