బురఖా యూనిఫాం మహిళా పోలీసుల కోసం
- June 07, 2016
చట్టాలు ఏవిధంగా ఉన్నా ప్రతీ దేశంలో పోలీసు వ్యవస్థ పనిచేసే తీరు, వారి యూనిఫాం(రంగులు వేరైనా) ఒకే రకంగా ఉంటాయి. కాగా ముస్లిం మహిళలు పోలీస్ శాఖలో చేరేందుకు స్కాట్ లాండ్ పోలీసులు ఓ వినూత్న ఆలోచన చేశారు. వారి కోసం బురఖా యూనిఫాంను అమలు చేయనున్నారు. పోలీసు శాఖలో ముస్లిం మహిళలను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్కాట్ లాండ్ పోలీస్ అధికారి పీటర్ బ్లేయిర్ తెలిపారు.
ఇందుకోసం బ్రిటన్ లో అతి పెద్దదైన స్కాట్ లాండ్ పోలీసు యార్డు అనేక డిజైన్లను రూపొందించింది. మొహం తప్పించి ఒళ్లంతా కప్పి ఉండే బురఖా తరహాలో యూనిఫాంను రూపొందించారు. దీంతో ఇక నుంచి బురఖా ధరించిన మహిళా పోలీసులు స్కాంట్లాండ్ పోలీసు శాఖలో దర్శనమివ్వనున్నారు.
స్కాట్లాండ్ లో 650 మైనారిటీ తెగల ప్రజలుంటే గతేడాది వీరి నుంచి 125 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో పోలీస్ శాఖలో వీరి ప్రాతినిథ్యాన్ని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీటర్ బ్లెయిర్ తెలిపారు.
తాజా వార్తలు
- అందుకే కేసీఆర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చాను: సీఎం రేవంత్
- శ్రీవారి మెట్ల మార్గంలో ప్రాథమిక చికిత్స కేంద్రం
- అగ్ని ప్రమాదంలో 16 మంది వృద్ధులు సజీవ దహనం
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు...హాజరుకానున్న సీఎం చంద్రబాబు
- గురుదేవ సోషల్ సొసైటీ 93వ శివగిరి తీర్థయాత్ర..!!
- యూఏఈలో డస్టీ వెదర్..NCM సేఫ్టీ మెజర్స్ జారీ..!!
- కువైట్ లో కోల్డ్ వేవ్స్..మంచు కురిసే అవకాశం..!!
- రియాద్ పరిసర ప్రాంతాలలో 25 కొత్త పార్కులు ప్రారంభం..!!
- జబల్ అఖ్దర్లో OMR9 మిలియన్లతో టూరిజం ప్రాజెక్టులు..!!
- ఇండోర్ ఫైర్, చార్కోల్ వినియోగం పై హెచ్చరికలు..!!







