జోహన్‌.. హంపస్‌ కి సినిమాల్లో నటించాలనే ఆసక్తి..

- June 08, 2016 , by Maagulf
జోహన్‌.. హంపస్‌ కి సినిమాల్లో నటించాలనే ఆసక్తి..

సినిమాల్లో కనిపించాలనే ఆశ చాలామందికి ఉంటుంది. ఆ ఆశతోనే చాలామంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని ముంబయి.. హైదరాబాద్‌.. చెన్నై వంటి నగరాలకు చేరుతుంటారు. అయితే.. అవకాశాలు రాకపోవడంతో విసిగిచెంది చాలావరకు వెనుదిరిగిన వాళ్లు ఉన్నారు. అలాంటిది ఎక్కడో పరాయి దేశంలో పుట్టి బాలీవుడ్‌లో నటించాలనే ఆసక్తితో దేశం కానీ దేశం వచ్చారు స్వీడన్‌కి చెందిన జోహన్‌.. హంస్‌. ఇక్కడి అవకాశాల కోసం ప్రయత్నించి చివరకు విజయం సాధించారు. 'రంగూన్‌'.. 'రుస్తుం'.. 'బంజో' వంటి చిత్రాల్లో చిన్న పాత్రలను దక్కించుకున్నారు. .
జోహన్‌.. హంపస్‌ ఇద్దరూ స్వీడన్‌లోనే పుట్టి పెరిగారు.
జోహన్‌కి సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఎక్కువ. ముఖ్యంగా హిందీ సినిమాల్లోని పాటలు.. ప్రేమకథలు.. డ్రామా అంటే చాలా ఇష్టమట. అందుకే పెద్ద చిత్ర పరిశ్రమల్లో ఒక్కటైన బాలీవుడ్‌లో నటించాలనుకున్నాడు. అందుకోసం ముంబయి రావాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయం కుటుంబసభ్యులకు చెప్పగా.. ముందు సరదాగా తీసుకున్నారు. కానీ.. తనలోని తపన చూసి సరే అన్నారట. ముంబయి వెళ్లనున్నట్లు అతని స్నేహితుడు హంపస్‌కి చెబితే తాను కూడా భారత్‌ రావడానికి ఆసక్తి చూపాడట. దీంతో ఇంతవరకు ఎప్పుడూ పరిచయం లేని ముంబయి మహానగరంలో రెక్కలు కట్టుకొని వాలిపోయారు జోహన్‌.. హంపస్‌.
మొదట ముంబయిలోని ఓ హాస్టల్‌లో ఉంటూ అవకాశాల కోసం వేట ప్రారంభించారు. బాలీవుడ్‌లో ఎలాంటి పరిచయాలు లేకపోవడంతో కష్టమైపోయింది. అదే సమయంలో హాస్టల్‌లోని ఓ వ్యక్తి సహాయంతో పలు ఆడిషన్లకు హాజరయ్యేవారట. చివరకు ఎన్నో కష్టాలు పడి అనుకున్నది సాధించారు. ప్రస్తుతం 'రంగూన్‌'.. 'రుస్తుం'.. 'బంజో' చిత్రాల్లో అవకాశాలు దక్కించుకున్నారు.
'రంగూన్‌'లో బ్రిటీష్‌ అధికారులుగా చిన్న పాత్రలో కనిపించబోతున్నారట. అలాగే హంపస్‌.. రితేశ్‌ దేశ్‌ముఖ్‌తో 'బంజో' చిత్రంలో అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఇక జోహన్‌.. రుస్తుంలో ఇషాగుప్తాకి అసిస్టెంట్‌లా నటిస్తున్నాడట.
దేశం కాని దేశం వచ్చినా భారత్‌ సాదరంగా ఆహ్వానించిందని.. బాలీవుడ్‌ అవకాశాలను అందించి తమ కలలను నిజం చేసిందంటున్నారు జోహన్‌.. హంపస్‌. ప్రస్తుతం చిన్న చిన్న పాత్రల్లో అవకాశాలు వస్తున్నాయని.. ఇక భారత్‌లోనే సెటిల్‌ అవుతామని చెబుతున్నారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com