శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత

- May 03, 2024 , by Maagulf
శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత

శంషాబాద్: గత నాలుగైదు రోజులుగా రంగారెడ్డి శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో అటవీ శాఖ అధికారులకు చుక్కలు చూపిస్తున్న చిరుతపులి ఎట్టకేలకు బోనులో చిక్కింది. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ఐదు రోజుల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఆరు రోజులపాటు అధికారులను ముప్పు తిప్పలు పెట్టిన చిరుత. ఏకంగా ఏర్పోర్ట్ రన్ వే మీదికి వచ్చింది. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ పోలీసులు సిఐఎస్ఎఫ్ అధికారులు తీవ్రంగా శ్రమించారు. ఎట్టకేలకు బోన్ లో చిరుత చిక్కడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పులి కోసం ఐదు బోన్లు, 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మేకలను బోనుల్లో ఉంచినప్పటికీ అది చిక్కుకోలేదు. పలుమార్లు బోను దగ్గరికి వెళ్లిన చిరుత మళ్లీ వెనక్కి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మేకను తినేందుకు బోను వద్దకు వెళ్లిన చిక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పులిని నెహ్రూ జూపార్క్‌కు తరలించనున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఒకరోజు పాటు పర్యవేక్షణలో జూ అధికారులు ఉంచనున్నారు. తర్వాత నల్లమల అడవిలో అటవీ శాఖ అధికారులు చిరుతను వదిలేస్తామని తెలిపారు. గత ఆదివారం (ఏప్రిల్ 28) ఉదయం గొల్లపల్లి నుంచి భద్రతా గోడ దూకి శంషాబాద్ విమానాశ్రయంలోకి చిరుత ప్రవేశించింది. దూకుతున్న సమయంలో ప్రహరీ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వైర్లకు తగిలి ఎయిర్‌పోర్ట్ కంట్రోల్ రూమ్‌లో అలారం మోగింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌లైన్స్ సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com