7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- May 03, 2024
న్యూఢిల్లీ: తనను ఈ నెల 7న ప్రత్యక్షంగా కోర్టులో హాజరుపరచాలని, వీడియో కాన్ఫరెన్స్ వద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోర్టును కోరారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత అరెస్టై తీహార్ జైల్లో ఉన్నారు. న్యాయస్థానం ఆమెను మే 7వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. దీంతో ఆరోజున విచారణ సంస్థలు ఆమెను కోర్టు ముందు హాజరుపరుస్తాయి. అయితే తనను ప్రత్యక్షంగా కోర్టులో హాజరుపరచాలని ఆమె దరఖాస్తు చేసుకున్నారు.
గతంలో కస్టడీ ముగిసినప్పుడు ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఇప్పుడు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుపరిచే అవకాశం ఉండటంతో కవిత దరఖాస్తు చేసుకున్నారు. కవిత అరెస్టైనప్పటి నుంచి రౌస్ అవెన్యూ కోర్టు నాలుగుసార్లు కస్టడీని పొడిగించింది. మొదటిసారి కోర్టుకు హాజరైనప్పుడు కవిత మీడియాతో మాట్లాడారు. దీంతో ఆ తర్వాత ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరుపరిచారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







