వాట్సప్ లో కొత్త ఫీచర్..
- May 03, 2024
వాట్సప్ త్వరలో మరో కొత్త ఫీచర్ తో ముందుకు రానుంది. ఇక ఇష్టం వచ్చినట్లు మెసేజ్లు చేస్తే సహించేందుకు కుదరదు. వాట్సప్ నిబంధనలకు వ్యతిరేకంగా మెసేజ్ లు పంపితే.. ఆ అకౌంట్ ను కొన్ని రోజులు బ్లాక్ చేస్తుందట. అయితే ఈ ఫీచర్ కేవలం కొత్త చాట్స్ చేయకుండా మాత్రమే ఆపుతోందని.. పాత చాట్స్ కంటిన్యూ చేయవచ్చని అంటున్నారు.
ఈ కొత్త ఫీచర్ గురించి వాట్సప్ బీటా ఇన్ఫో తెలిపిన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. వాట్సప్ నిబంధనలను ఎవ్వరూ లెక్కచేయట్లేదు. అసలు వాట్సప్ కు నిబంధనలు ఉన్నాయన్న విషయాన్నే మర్చిపోయారు. తమకు ఇష్టం వచ్చినట్లు మెజేజ్లు చేస్తూ.. అతి చేస్తుంటారు. గత కొంత కాలం నుంచి స్పామ్ మెజేజ్లు సైతం ఫార్వర్డు అవుతున్నాయి. ఇలాంటి సమస్యల నుంచి వినియోగదారులను సేవ్ చేయడానికే కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు వాట్సప్ తెలిపింది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిని పూర్తిగా తప్పించకుండా.. తాత్కాలికంగా బ్లాక్ చేయనున్నారు. అంతే కాకుండా ఏ కారణంగా వారి అకౌంట్ బ్లాక్ చేయబడిందో అనే విషయాన్ని వినియోగదారులకు తెలియజేయనుంది వాట్సప్. తాత్కాలికంగా బ్యాన్ చేసిన వాట్సప్ హిస్టరీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది. కొత్త ఫీచర్ అకౌంట్ ను కాకుండా చాట్స్ ను మాత్రమే చేయకుండా అడ్డుకుంటుందని వివరించింది. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ వచ్చిన వెంటనే అది వినియోగదారులకు అర్థమచయ్యేలా పాప్ అప్ మెసేజ్ బ్లింక్ అవుతుంది. ఈ ఫీచర్ వినియోగదారులకు మరింత మెరుగ్గా సేవలందించేందుకు చేయబడిందని సంస్థ చెప్పింది. ఈ ఫీచర్ ద్వారా ఇక వినియోగదారులకు ప్రొటెస్ట్ పెరుగుతుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







