సుహాస్ లిస్టులో మరో హిట్టు చేరిందోచ్.!
- May 04, 2024
కంటెంట్ వున్న కథలతో మెప్పించుకుంటూ పోతున్నాడు హీరోగా సుహాస్. మొన్న ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’తో సూపర్ హిట్టు కొట్టిన సుహాస్, మళ్లీ ‘ప్రసన్నవదనం’తో ఇంకో హిట్టు కొట్టాడు. ఫేస్ బ్లైండ్నెస్ అనే వ్యాధితో బాధపడే వ్యక్తిగా తనదైన పర్ఫామెన్స్ ఇచ్చాడు సుహాస్.
ఏ పాత్రలోనైనా సెటిల్డ్ పర్పామెన్స్తో ఆకట్టుకునే సుహాస్ ఈ సినిమాలో ఓ వైపు రేడియో మిర్చిలో పని చేస్తూనే తనకు తోచినంతలో అందరికీ సాయం చేసుకుంటూ పోతుంటాడు. అలాగే అనుకోని పరిస్థితుల్లో అనుకోని సమస్యల్లో ఇరుక్కుంటాడు. తనకున్న అరుదైన వ్యాధితో ఆ సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు.? అనేది ‘ప్రసన్నవదనం’ కథ.
థ్రిల్లర్ మూవీస్‌కి ఈ మధ్య మంచి ఆదరణ దక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆ కోవకే చెందిన ‘ప్రసన్నవదనం’కి మంచి మౌత్ టాక్ వచ్చింది. దాంతో, సమ్మర్ హాలీడేస్‌లో ఈ సినిమా కూడా బాగానే నిలదొక్కుకునే అవకాశాలున్నాయ్. కామెడీ, ఎమోషన్, యాక్షన్, థ్రిల్లింగ్, ఛేజింగ్. ఇలా అన్ని రకాల ఎమోషన్లు వుండడంతో సినీ ప్రియులు ఈ సినిమాని బాగానే ఆదరిస్తారని అంచనా వేయొచ్చు. చూడాలి మరి.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!