భారత క్రికెట్ జట్టు ముంబయి నుంచి జింబాబ్వేకు ..
- June 08, 2016
పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ముంబయి నుంచి జింబాబ్వేకు బుధవారం బయల్దేరి వెళ్లింది. యువ క్రికెటర్లు, అనుభవంలేని ఆటగాళ్లతో కూడిన భారత జట్టు పర్యటనలో భాగంగా జింబాబ్వేతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. ఈ నెల 11న ప్రారంభంకానున్న సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతాయి.టీ20 ప్రపంచకప్ వరకు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సంజయ్ భంగర్‌ను జింబాబ్వే సిరీస్‌కు తాత్కాలిక ప్రధాన కోచ్‌గా బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ధోని తన కెరీర్లో ఇప్పటి వరకు 275 వన్డేలు, 68 టీ20 మ్యాచ్‌లు ఆడగా ఈ సిరీస్‌లో ఉన్న మిగతా ఆటగాళ్లందరూ కలిసి ఇప్పటివరకు 83 వన్డేలు, 28 టీ20 మ్యాచ్‌ల్లో పాల్గొనడం విశేషం.'జింబాబ్వేతో సిరీస్‌లో ఆడబోయే ఆటగాళ్లలో చాలామంది కొత్త. కాబట్టి త్వరగా వారిపై నేనో అవగాహనకు రావాలి. జట్టు అవసరాల మేరకు ఎవరినెలా వినియోగించుకోవాలో ఇంకా నిర్ణయించుకోవాల్సి ఉంది' అని కెప్టెన్ ధోని వెల్లడించాడు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







