నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- May 05, 2024
యూఏఈ: వచ్చే భారత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ కు గల్ప్ కార్మికులు మద్దతు తెలిపారు. అబుదాబి సమావేశమైన గల్ప్ కార్మికులు.. ఈ మేరకు మద్దతు ప్రకటించారు. అదే విధంగా నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలని గల్ఫ్ లో ఉన్న కార్మికులు ఆకాక్షించారు. ఈ మేరకు గల్ప్ కార్మికుల సంఘం నాయకులు పెనుకుల అశోక్ తెలిపారు. కొందరు కావాలని గల్ఫ్ కార్మికులను వాడుకొని వారి రాజకీయ లబ్ధి కోసమే బిజెపి పార్టీని. ఎంపీ అరవింద్ గారిని విమర్శలు చేస్తున్నారని అన్నారు. కచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అరవింద్ కేంద్ర మంత్రి కూడా అవుతారని ఆశభావం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ఎంపీ అరవింద్ ఎంతోమంది గల్ఫ్ కార్మికులను అక్కున చేర్చుకొని, వారి కుటుంబాలకు భరోసా ఇచ్చారని తెలిపారు. అరవింద్ ను విమర్శించే స్థాయి నంగి దేవేందర్ రెడ్డి ది కాదన్నారు.మీరు చేసిన సేవలపై తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికులు గంగాధర్, సంగేశ్వర్ ,బియా, రామ్ చరణ్, అజయ్, కొమరం, నర్సయ్య పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా