నెలసరిలో వచ్చే ఇన్ఫెక్షన్స్‌ సహజమే కానీ జాగ్రత్త

- July 01, 2015 , by Maagulf
నెలసరిలో వచ్చే ఇన్ఫెక్షన్స్‌ సహజమే కానీ జాగ్రత్త


సాధారణంగా టేనేజ్‌లో హార్మోన్స్‌ సమతుల్యత, అసమతుల్యతల కారణంగా, తమ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి టీనేజ్‌ అమ్మాయిల్లో. అయితే వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది నెలసరి సమస్య. ఈ సమయంలో వచ్చే కడుపు నొప్పి, వికారం, అధిక రక్తస్రావం లాంటి సమస్యలను అధిగమించాలంటే కేవలం కొద్డిగా ప్రాధమిక అవగాహన, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటి గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా నెలసరి సమయంలో వచ్చే నొప్పికి కారణం. అండం విడుదలయ్యేటప్పుడు అక్కడి కండరాలు సంకోచ, వ్యాకోచాల వల్ల ఈ నొప్పి కలుగుతుంది. ఈ సమయంలో సాధారణంగా తీసుకునే జాగ్రత్తలను పాఠిస్తే సరిపోతుంది. నూలు లోదుస్తులు ధరించడం, పరిశుభ్రమైన న్యాప్‌కీన్లు వాడడంలాంటివి చేయాలి. ఈ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే జననేంద్రియాల దురద, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ సమస్యకు అధిక బరువు కూడా ఒక కారణం కావచ్చు. ఈ అధిక బరువు వల్ల జననేంద్రియాల వద్ద రాపిడి జరిగి పుండు పడే అవకాశం కూడా ఉంది. ఇలాంటప్పుడు ఆందోళన చెందకుండా వైద్యుని సంప్రదించడం వల్ల కొన్ని న్యాపీ క్రీంలు, పౌడర్లులాంటివి సూచిస్తారు. వాటిని వాడడం వల్ల అసౌకర్యం తగ్గడమే కాకుండా రాపిడిని కూడా నియంత్రించుకోవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com