భారత్ దేశం లో 21 నకిలీ యూనివర్శిటీలు... జాబితా విడుదల
- July 01, 2015
భారత్ దేశం లో నానాటికీ పెరిగిపోతున్న విద్యా సంబంధిత నేరాలను అడ్డుకునేందుకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నడుంకట్టింది. అందుకోసం దేశవ్యాప్తంగా చట్టవిరుద్ధంగా ఏర్పాటై కార్యకలాపాలను సాగిస్తున్న 21 నకిలీ యూనివర్శిటీలను గుర్తించింది. ఆ నకిలీ యూనివర్శిటీల జాబితాలను బుధవారం యూజీసీ విడుదల చేసింది. ఆ జాబితా ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా ఎనిమిది నకిలీ యూనివర్శిటీలు ఉండగా, దేశ రాజధాని నగరంలో 6 నకిలీ వర్శిటీలు ఉన్నట్టు వెల్లడించింది. యూజీసీ విడుదల చేసిన నకిలీ యూనివర్శిటీల పేలర్లు. మైథిలి యూనిర్శిటీ (బీహార్), వరణ్ సేయ సంస్కృత్ విశ్వవిద్యాలయ (ఢిల్లీ), కమర్షియల్ యూనివర్శిటీ లిమిటెడ్ (ఢిల్లీ). యునైటెడ్ నేషన్స్ యూనివర్శిటీ (ఢిల్లీ), వొకేషనల్ యూనివర్శిటీ (ఢిల్లీ), ఏడీఆర్-సెంట్రల్ జ్యూరిడికల్ యూనివర్శిటీ (ఢిల్లీ), ఇండియన్ ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ , సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఢిల్లీ), బదగ్నావి సర్కార్ వరల్డ్ ఓపెన్ ఎడ్యుకేషనల్ సొసైటీ (కర్ణాటక), సెయింట్ జాన్స్ యూనివర్శిటీ (కేరళ), కేశర్వాణి విద్యాపీఠ్ (జబల్పూర్-మధ్యప్రదేశ్), రజా అరబిక్ యూనివర్శిటీ (మహారాష్ట్ర), డీడీబీ సంస్కృత్ యూనివర్శిటీ (తమిళనాడు), ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ , మెడిసిన్ (పశ్చిమ బెంగాల్). మహిళా గ్రామ్ విద్యాపీఠ్ (ఉత్తరప్రదేశ్), గాంధీ హిందీ విద్యాపీఠ్ (ఉత్తరప్రదేశ్), నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి (ఉత్తరప్రదేశ్), నేతాజి సుభాష్ చంద్రబోస్ యూనివర్శిటీ (ఉత్తరప్రదేశ్), ఉత్తరప్రదేశ్ విశ్వవిద్యాలయ (ఉత్తరప్రదేశ్), మహారాణా ప్రతాప్ శిక్షా నికేతన్ విద్యాలయ (ఉత్తరప్రదేశ్), ఇంద్రప్రస్థ శిక్షా పరిషత్ (ఉత్తరప్రదేశ్), గురుకుల్ విశ్వవిద్యాలయ (ఉత్తరప్రదేశ్)గా యూజీసీ వెల్లడించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







