రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 'బంగారం' పట్టివేత

- July 01, 2015 , by Maagulf
రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 'బంగారం' పట్టివేత

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణీకుడు అక్రమంగా తీసుకొచ్చిన మూడు కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో అతడికి చెందిన టేబుల్ ఫ్యాన్ చాలా బరువు ఉండటంతో కస్టమ్స్ అధికారులు సందేహించి ... క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అందులోభాగంగా ఫ్యాన్ కింద భాగంలో భారీగా బంగారం బిస్కెట్లు ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఆ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

 

--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com