షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు

- May 05, 2024 , by Maagulf
షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు

యూఏఈ: షార్జా పెట్రోలియం కౌన్సిల్ హడిబా ఫీల్డ్‌లో కొత్త గ్యాస్ నిల్వలను కనుగొన్నట్లు ప్రకటించింది. షార్జా నేషనల్ ఆయిల్ కార్పొరేషన్ డ్రిల్లింగ్ చేసిన తర్వాత, అల్ సజా క్షేత్రానికి ఉత్తరాన ఉన్న ప్రాంతంలో గ్యాస్ నిక్షేపాలను గుర్తించినట్లు తెలిపింది. షార్జా ప్రభుత్వ కథనం ప్రకారం.. అభివృద్ధి కోసం ఫీల్డ్ నిల్వలను నిర్ధారించడానికి రాబోయే కాలంలో పరీక్షించనున్నట్లు తెలిపింది.  "హడిబా" ఫీల్డ్ షార్జాలో ఐదవ సముద్రతీర క్షేత్రం."అల్-సజా, కహీఫ్, మహనీ మరియు ముయెద్ ఫీల్డ్‌లతో పాటు వీటిని గ్యాస్ నిల్వ క్షేత్రంగా మార్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com