‘భజే వాయువేగం’.! పేరులోని వేగం సక్సెస్‌లో ఎక్కడ కార్తికేయ.!
- May 06, 2024
‘బెదురులంక’ సినిమాతో ఈ మధ్య కార్తికేయ బౌన్స్ బ్యాక్ అయిన సంగతి తెలిసిందే. లో బడ్జెట్ మూవీగా ఈ సినిమా ఒకింత బాగానే ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఓటీటీ ప్రేక్షకులు బాగా ఆదరించారీ సినిమాని.
ఇప్పుడు కార్తికేయ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘భజే వాయు వేగం’. ప్రశాంత్ రెడ్డి దర్శకుడు. సినిమాలో వేగం బాగానే వుంది. ప్రోమోలు కూడా పాజిటివ్‌గానే ప్రేక్షకుల్లోకి ఎక్కుతున్నాయ్.
ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా. ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. కాగా, ‘బెదురులంక’ సినిమాతో కొట్టిన సక్సెస్‌ని కార్తికేయ ‘భజే వాయు వేగం’ సినిమాతో కొడతాడా.? లేదా.? చూడాలి మరి.
అన్నట్లు ఈ సినిమాకి హనుమంతుడి సెంటిమెంట్ కూడా బాగానే వర్కవుట్ అయ్యేలా వుంది. ఈ మధ్య హనుమాన్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృస్టిస్తున్నాయ్.
కాన్సెప్ట్ ఏదైనా సరే, ఆ హనుమంతుడి బ్యాక్ డ్రాప్‌తో మిళితమైన టైటిల్ పెట్టుకున్నందుకు కార్తికేయకు ఈ సినిమా కూడా కలిసొస్తుందేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా