ప్రబాస్ - హను రాఘవపూడి ఆ టైటిల్‌నే ఫిక్స్ చేశారా.?
- May 06, 2024
ప్రబాస్ లిస్టులో ఒక్కటి కాదు రెండు కాదు.. అరడజను వరకూ ప్రాజెక్టులున్నాయ్. ఇప్పటికే రెండు సినిమాలను సమాంతరంగా పూర్తి చేస్తున్నాడు ప్రబాస్. అవే ఓ వైపు ‘కల్కి’, మరోవైపు ‘రాజా సాబ్’.
ఇదే లిస్టులో వున్న మరో సినిమా హను రాఘవపూడిది. ఈ సినిమాని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వరల్డ్ వార్ నేపథ్యంలో సాగే బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా కాన్సెప్ట్ వుండబోతోందని హను రాఘవపూడి హింట్ ఇచ్చాడు.
‘సీతారామం’ సినిమాతో తనకు కలిసొచ్చిన ఫార్ములానే ఈ సినిమాకీ ఆపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రబాస్ వంటి యూనివర్సల్ హీరోతో అంటే సబ్జెక్ట్ స్కేల్ కూడా ఆ రేంజ్‌లోనే వుంటుంది.
ఇక ఈ సినిమాకి ‘ఫౌజీ’ అనే పేరు ప్రచారంలో వుంది. తాజాగా ఈ పేరును హను రాఘవపూడి రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. అంటే దాదాపు ఇదే టైటిల్‌ని ఈ సినిమాకి పెట్టబోతున్నారని అనుకోవచ్చునేమో. ‘ఫౌజీ’ అంటే సైనికుడు.
అప్పుడు ‘కృష్ణ గాడి వీర ప్రేమగాధ’.. ఇప్పుడు ఓ సైనికుడి వీర ప్రేమ గాధతో రూపొందుతోన్న చిత్రమే ‘ఫౌజీ’ అన్నమాట.
తాజా వార్తలు
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్‌లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్‌కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!







