‘సరిపోదా శనివారం’.! నాని వెనక్కి తగ్గాల్సిందేనా.?

- May 06, 2024 , by Maagulf
‘సరిపోదా శనివారం’.! నాని వెనక్కి తగ్గాల్సిందేనా.?

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ ఈ సినిమాకి దర్శకుడు. ‘హాయ్ నాన్న’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి సక్సెస్ జోరు మీదున్న నాని నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయ్.

అంతేకాదు, ఆల్రెడీ రిలీజ్ చేసిన ప్రోమో కూడా సినిమాపై ఒకింత ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో డిఫరెంట్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా ఆగస్ట్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్.

ఆ దిశగా మేకర్లు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. కానీ, అత్యంత సన్నిహిత వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశముందని తెలుస్తోంది.

కొన్ని నెలల పాటే ఆ వాయిదా వుండబోతోందని మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం ఆగస్టులోనే రిలీజ్ కానున్న ‘పుష్ప 2’ మూవీ.

ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయ్. అందుకు తగ్గట్లుగానే సుకుమార్ అండ్ టీమ్ ఈ సిసిమా కోసం కష్టపడుతోంది. సో, అంచనాలకు తగ్గట్లుగానే సినిమా అవుట్ పుట్ వుండి, అనుకున్న టైమ్‌కే రిలీజ్ అయ్యి రెస్పాన్స్ ఊహించినట్లుగానే వస్తే.. ఖచ్చితంగా నాని సినిమా వాయిదా పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com