ప్రబాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.!
- May 07, 2024
‘సలార్’తో ప్రబాస్ ఫ్యాన్స్‌కి కాస్త ఊరట లభించినట్లయ్యింది. ఫ్యాన్స్‌కే కాదు, ప్రబాస్లోనూ కాస్త హుషారొచ్చింది. దాంతో వరుసగా సినిమాలు ఓకే చేశాడు.
ఓకే చేయడమే కాదు, వరుసగా సెట్స్ మీదికీ తీసుకెళుతున్నాడు. ఆల్రెడీ రెండు సినిమాలు సెట్స్ మీదున్నాయ్. రేపో మాపో పూర్తి కానున్నాయ్ ఈ రెండు సినిమాలు. అవే ‘రాజా సాబ్’, ‘కల్కి’ సినిమాలు.
ఇక, ఇప్పుడు మరో రెండు ప్రాజెక్టులు పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడట. అందులో ‘సలార్ 2’ ఒకటి. వచ్చే నెల నుంచే ‘సలార్ 2’ రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది. అయితే, ప్రబాస్ లేకుండానే మొదట కొన్ని సీన్లు తెరకెక్కించనున్నారట.
జూలైలో షూట్లో జాయిన్ అవ్వబోతున్నాడట ప్రబాస్. జూన్‌లో హను రాఘవపూడితో పీరియాడికల్ మూవీని స్టార్ట్ చేయబోతున్నాడట. ‘ఫౌజీ’ అనే టైటిల్ ఈ సినిమాకి పరిశీలనలో వుంది. అలాగే సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ మూవీని సైతం ఈ ఏఢాదిలోనే పట్టాలెక్కించేయాలనుకుంటున్నాడట ప్రబాస్.
ఇలా చూసుకుంటే.. ప్రబాస్ షెడ్యూల్ ప్రస్తుతం మామూలు బిజీగా లేదు. ఇంత బిజీగా వున్న తమ అభిమాన హీరోని చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుసీ అవుతున్నారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..