దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- May 09, 2024
దుబాయ్ : వరుసగా నాలుగు నెలల పెట్రోల్ ధరల పెరుగుదల తర్వాత దుబాయ్‌లో టాక్సీ ఛార్జీలు కిలోమీటరుకు 12 ఫిల్స్ పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఉదాహరణకు, స్పెషల్ 95 ధర జనవరిలో మాత్రమే లీటరుకు Dh2.71 ఉండగా, ఇప్పుడు లీటరుకు Dh3.22 అయింది. దుబాయ్ టాక్సీ కంపెనీ PJSC (DTC) వెబ్‌సైట్ ప్రకారం.. దుబాయ్‌లో టాక్సీలకు కిలోమీటరుకు ఇప్పుడు 2.09 ఛార్జ్ ఉంది. ఇది గతంలో కిలోమీటరుకు Dh1.97తో పోలిస్తే 12 ఫిల్స్ పెరిగింది. ఉదహరణకు..అల్ బార్షా నుండి దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు టాక్సీని తీసుకునే కస్టమర్ 25 కిలోమీటర్ల ప్రయాణానికి సుమారు 3 దిర్హామ్‌లు అదనంగా చెల్లించాలి.
చివరిసారిగా జూలై 2022లో టాక్సీ ఛార్జీల పెరిగాయి. ఆ సమయంలో ప్రపంచ చమురు ధరలు బ్యారెల్‌కు $100 కంటే ఎక్కువగా ఉన్నాయి. టాక్సీ ఛార్జీని కిమీకి 1.99 దిర్హామ్‌ల నుండి కిమీకి 2.19 దిర్హామ్‌లకు 20 ఫిల్స్ పెంచారు. ప్రస్తుతం అంతర్జాతీయ చమురు ధరలు బ్యారెల్‌కు $83 మరియు $87 మధ్య ఉన్నాయి. మార్చిలో ధరతో పోలిస్తే సగటున బ్యారెల్‌కు $4.53 పెరిగింది.
అజ్మాన్, షార్జాలోనూ పెరుగుదల
అజ్మాన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఈ ఏడాది మార్చి నుండి టాక్సీ ఛార్జీలలో 4-ఫిల్ పెంపును అమలు చేసింది. టాక్సీ ఛార్జీలు కిలోమీటరుకు 1.83 దిర్హామ్‌లకు పెంచబడ్డాయి. ఫిబ్రవరిలో 1.79 దిర్హామ్‌లు పెరిగాయి. షార్జాలో టాక్సీ ఛార్జీల పెంపుదల లేదు. కానీ ఇటీవలి చమురు ధరల పెరుగుదల దుబాయ్ మరియు షార్జా మధ్య కొన్ని మార్గాలను అలాగే ఇంటర్‌సిటీ ధరలను ప్రభావితం చేసింది. షార్జా బస్సు ఛార్జీలు మార్చి 1 నుండి కొన్ని రూట్లలో 3 దిర్హాంలు పెరిగాయి. ఉదాహరణకు, షార్జాలోని రోలా నుండి అల్ క్వోజ్ (బస్ రూట్ 309) మీదుగా దుబాయ్‌లోని మాల్ ఆఫ్ ఎమిరేట్స్‌కు బస్సు ఛార్జీలు Dh17 నుండి Dh3 పెరిగింది.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం
- పర్యావరణ అసమతుల్యంతో ఎండ తీవ్రత
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!









